
VIDEO: ఉమ్రాకు వెళ్తే.. బంధువులే రూ.29 లక్షలు కొల్లగొట్టారు!
హైదరాబాద్‌లో ఉమ్రా యాత్రకు వెళ్లిన బంధువుల ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హబీబ్‌నగర్‌లో తాళాలు పగులగొట్టి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, ఫింగర్‌ప్రింట్స్ ఆధారంగా నిందితులను గుర్తించి, వారి నుంచి 134 గ్రాముల బంగారం, రూ.12.50 లక్షల నగదుతో సహా మొత్తం రూ.29 లక్షల విలువైన సొత్తు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.




