TG: హైదరాబాద్ జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి పాస్‌పోర్టు,
వీసా సహా ఎలాంటి చెల్లుబాటు పత్రాలు లేవని, అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి నివసిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ఓ అద్దె ఇంట్లో తనిఖీలు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకుని జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలించారు.