ఏడు నెలల పసికందుపై బ్లేడ్‌తో దాడి.. పొదల్లో పడేసిన దుండగులు!

27చూసినవారు
ఏడు నెలల పసికందుపై బ్లేడ్‌తో దాడి.. పొదల్లో పడేసిన దుండగులు!
TG: కామారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బీర్కూర్ ఇందిరా కాలనీలో మంగళవారం రాత్రి తండ్రితో కలిసి ఇంటి బయట నిద్రిస్తున్న ఏడు నెలల పసికందు వైష్ణవిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. బుధవారం ఉదయం స్థానిక పొదల్లో స్పృహ తప్పి పడి ఉన్న చిన్నారిని గుర్తించారు. దుండగులు పాప ఒంటిపై బ్లేడ్‌తో కోసి గాయపరిచారు. తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్