'యంగెస్ట్ స్విమ్మర్'గా ఏడేళ్ల ఇషాంక్ సింగ్ ప్రపంచ రికార్డ్ (వీడియో)

42చూసినవారు
ఏడేళ్ల బాలుడు సముద్రాన్ని జయించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన ఇషాంక్ సింగ్  శ్రీలంక నుండి ధనుష్కోడి వరకు 29 కిలోమీటర్ల ప్రమాదకరమైన పాల్క్ జలసంధిని కేవలం 9 గంటల 50 నిమిషాల్లో ఈది ఆశ్చర్యపర్చాడు. ఈ ఘనతతో 'యంగెస్ట్ స్విమ్మర్'గా యూనివర్సల్ రికార్డ్స్ ఫోరమ్‌లో చోటు సంపాదించాడు. చిన్న వయసులోనే పట్టుదలతో ఈ సాహసం చేసిన బాలుడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ట్యాగ్స్ :