తీవ్ర వాయుగుండం తీరం దాటినా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రానున్న 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. తెలంగాణలో నిన్నటితో పోలిస్తే వర్షాల తీవ్రత తగ్గిందని, తీవ్ర వాయుగుండం ఛత్తీస్గఢ్, ఒడిశా వైపు కదులుతోందని పేర్కొంది. కొమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.