భద్రాద్రి జిల్లాలో భారీ గాలి(టోర్నడో) బీభత్సం

12398చూసినవారు
TG: భద్రాద్రి జిల్లాలోని మొరంపల్లి బంజర్‌లో భారీ గాలి (టోర్నడో) బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో అనేక పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లపై చెట్లు విరిగిపడటంతో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. తెగిపోయిన విద్యుత్ తీగలతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి సహాయం అందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్