తెలంగాణలో బీసీ మహిళల సాధికారత, ఆర్థికాభివృద్ధి కోసం ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకం ద్వారా వారికి కుట్టు మిషన్లు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. 100 శాతం సబ్సిడీతో ఉచితంగా అందించనుంది. అర్హులైన మహిళలు ఆన్లైన్ ద్వారా సెప్టెంబరు 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల వరకు మించకూడదు. పేద మహిళలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలకు ప్రాధాన్యం ఇస్తారు.