45 ఏళ్ల వ్యక్తిపై లైంగిక వేధింపులు, హత్య.. నిందితుల అరెస్ట్(వీడియో)

16చూసినవారు
TG: లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నాచారం పీఎస్ పరిధిలో జరిగింది. ఉప్పల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి(45)ని కారులో ఎక్కించుకున్న నలుగురు యువకులు (ఒక మైనర్) మార్గమధ్యలో అతడిని లైంగికంగా వేధించారు. బాధితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా, వారు అతన్ని నాచారం పారిశ్రామికవాడకు తీసుకెళ్లి కత్తితో పొడిచారు. బాధితుడిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.