హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై, అక్కడే ఫుడ్‌వెండర్‌గా పనిచేస్తున్న షేక్‌నబీ అనే వ్యక్తి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2023లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో బాధితురాలిని బెదిరించి 2026 ఆగస్టు వరకు పలుమార్లు అత్యాచారం చేశాడు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.