ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం
Sep 28, 2026, 03:09 IST/

ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం

Sep 28, 2026, 03:09 IST
TG: మహిళా ప్రయాణికురాలిపై ఓ క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించిన ఘటన శంషాబాద్‌లో చోటు చేసుకుంది. గచ్చిబౌలికి చెందిన ఓ మహిళ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఆ క్యాబ్‌లో బయలుదేరింది. ఈ క్రమంలోనే తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద డ్రైవర్ కారును దారి మళ్లించాడు. కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో క్యాబ్ డ్రైవర్ భయపడి, ఆమె వద్ద ఉన్న రూ.60 వేల బ్యాగ్‌తో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.