TG: హైదరాబాద్ ఉప్పల్లో అమానుష ఘటన వెలుగు చూసింది. శారద అనే మహిళకు మేడిపల్లికి చెందిన మాలోత్ రవితో వివాహేతర సంబంధం ఉంది. అయితే శారద మైనర్ కూతురిపై కన్నేసిన రవి.. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలిసినా రవిని నిలదీయకుండా అతనికి సహకరించింది. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు రవితో పాటు బాలిక తల్లిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.