మనవరాలిపై లైంగిక దాడి: కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

0చూసినవారు
మనవరాలిపై లైంగిక దాడి: కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
విజయనగరంలో ఆరేళ్ల మనవరాలిపై లైంగిక దాడికి పాల్పడిన బి.సత్యారావు అనే వ్యక్తికి పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి సోమవారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. ఆగస్టు 18న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘోరం జరిగింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నేరారోపణ రుజువైన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. బాధితులకు రూ.5 లక్షల పరిహారం మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ దామోదర్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్