TG: హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలోని ప్రగతినగర్‌లో తొమ్మిదేళ్ల బాలుడిపై కుటుంబానికి పరిచయమున్న ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 19 రాత్రి జరిగిన ఈ ఘటనలో నిందితుడు బాలుడిని బెదిరించినట్లు సమాచారం. బెదిరించినప్పటికీ, జరిగిన విషయాన్ని బాధితుడు తన తండ్రికి చెప్పడంతో, సెప్టెంబర్ 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.