యువతిపై లైంగిక దాడి.. యువ క్రికెటర్‌పై ఛార్జిషీట్

64చూసినవారు
యువతిపై లైంగిక దాడి.. యువ క్రికెటర్‌పై ఛార్జిషీట్
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన బంగ్లాదేశ్ 'ఏ' జట్టు క్రికెటర్ టోఫెల్ అహ్మద్ రైహాన్‌పై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతిని జనవరి 31న హోటల్ గదికి తీసుకెళ్లి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 1న ఫిర్యాదు చేయగా, సెప్టెంబర్ 24న టోఫెల్‌కు హైకోర్టు ఆరు నెలల ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే, కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్