ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని 110కి పైగా పాఠశాలల్లో చిన్నారులపై లైంగిక దాడులు జరిగినట్లు బ్రిటన్ పత్రిక సంచలన కథనం వెల్లడించింది. 84 ప్రీస్కూల్స్, 20 ప్రైమరీ స్కూల్స్, 10 డేకేర్ సెంటర్లలో ఈ దాడులు జరిగినట్లు సమాచారం. సాధారణంగా ఫ్రాన్స్‌లో చిన్నారులకు సంబంధించిన విచారణ రహస్యంగా జరుగుతుంది, కానీ ఇప్పుడు బహిరంగంగా నిర్వహించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిందితులపై బహిరంగ విచారణ మొదలైంది.