యూపీలోని మీరట్‌లో యువతిపై లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. టీపీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయా బస్తీ కాలనీలో డిగ్రీ విద్యార్థినిపై ఓ ఆకతాయి బహిరంగంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు నిందితుడిని తీవ్రంగా కొట్టారు. ఆగ్రహానికి గురైన మహిళలు కర్రలతో చితకబాదారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.