లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ‘ధురంధర్’ మూవీకి పని చేసిన ప్రొడక్షన్ డిజైనర్ సైనీ జోహ్రేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది సెప్టెంబర్ 10న సినిమాకు సంబంధించిన చర్చల కోసం సైనీ తనను ఓ హోటల్‌కు రావాలని కోరినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడికి వెళ్లాక తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు.