కరీంనగర్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం SFI కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.