TG: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ.. SFI
విద్యార్థులు హైదరాబాద్లో లోక్‌భవన్‌ను ముట్టడించారు. దీంతో వారిని పోలీసులు పెద్ద ఎత్తున నిలువరించారు.
నీట్ యూజీ పేపర్ లీకేజీలో
విద్యార్థులు బలైపోయారనీ, అందువల్ల ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చెయ్యాలని
విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తత నేపథ్యంలో రాజ్ భవన్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది