భారత సంపన్న నటుడిగా షారుక్ ఖాన్ మరోసారి నిలిచారు. హురున్
ఇండియా రిచ్ లిస్ట్-2026 ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.10,000 కోట్లుగా ఉంది. 2025లో ఈ విలువ రూ.12,490 కోట్లుగా ఉండగా.. ఏడాదిలో రూ.2,490 కోట్లు తగ్గింది. అయినప్పటికీ భారత నటుల్లో అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా షారుక్ కొనసాగుతున్నారు. ఆయన సంపదలో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, నైట్ రైడర్స్ స్పోర్ట్స్ వంటి వ్యాపారాల వాటాలు కూడా ఉన్నాయి.