
భారత్ అలౌట్.. ఆసిస్ టార్గెట్ 126
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే పరిమొతమైంది. అభిషేక్ శర్మ 68 పరుగులతో రాణించాడు. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా అభిషేక్, హర్షిత్ రాణా (35) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్ (5), శాంసన్ (2), సూర్య (1), తిలక్ (0), అక్షర్ పటేల్ (7), శివమ్ దూబే (4) బ్యాటింగ్‌లో విఫలం అయ్యారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్‌వుడ్ 4 ఓవర్లు వేసి కేవలం 13 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశారు.




