
కోర్టు ఆవరణలో మహిళపై సామూహిక అత్యాచారం
మహారాష్ట్రలోని థానేలో ఫ్యామిలీ కోర్టు ఆవరణలో ఓ కారులో వివాహితపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, కేక్‌లో మత్తుమందు కలిపి తినిపించి, స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 25, 2024న జరిగిన ఈ ఘటనపై బాధితురాలు ఈ నెల 5న ఫిర్యాదు చేసింది. అత్యాచారాన్ని వీడియో తీసి బెదిరించడం వల్లే ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు భావిస్తున్నారు.




