AP: అనకాపల్లి జిల్లాలో శారదా నది ఉగ్రరూపం దాల్చింది. రాంబిల్లి మండలం వైలోవ గ్రామ సమీపంలో నది ఎడమ గట్టుకు సుమారు 40 మీటర్ల పొడవైన భారీ గండి పడింది. దీని కారణంగా వరద నీరు వైలోవ, రజాల, చిన్నకలవలపల్లి, పెదకలవలపల్లి గ్రామాలను ముంచెత్తింది. ఈ నాలుగు గ్రామాలు ప్రస్తుతం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.