
ఫాల్కన్ కేసులో ఈడీ కీలక నిర్ణయం
TG: ఫాల్కన్ కేసులో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న విమానాన్ని ఈడీ అధికారులు అమ్మకానికి పెట్టారు. బేగంపేట ఎయిర్పోర్టులో విమానాన్ని వేలం వేయనున్నారు. డిసెంబర్ 7న విమానం పరిశీలన, డిసెంబర్ 9న ఆన్లైన్లో వేలం జరగనుంది. కాగా ఈ కంపెనీ అసత్య ప్రకటనల ద్వారా దేశ వ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ తేల్చింది.




