మే నెలలో భారత్ - పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను చల్లార్చి, యుద్ధాన్ని నివారించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపేనని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి ప్రశంసించారు. ఆయన వల్లే కాల్పుల విరమణ సాధ్యమైందని, ఒక పెద్ద యుద్ధం నివారించబడిందని, లక్షలాది మంది ప్రాణాలు నిలిచాయని పేర్కొన్నారు. గతంలో ట్రంప్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయగా భారత్ ఖండించింది. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చింది.