
ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్‌డెడ్ (వీడియో)
TG: సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగరాజు అనే యువకుడు టూవీలర్‌పై వెళ్తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు వేగంగా ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే నాగరాజు ఎదురుగా వస్తున్న బస్సును చూసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్డు దాటేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని వెళ్లాలని సూచిస్తున్నారు.




