చార్మింగ్ స్టార్ శర్వానంద్, 'సామజవరగమన' దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటించిన 'నారి నారి నడుమ మురారి' చిత్రం 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి సీజన్‌లో శర్వానంద్ చిత్రాలకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. చిత్ర యూనిట్ త్వరలో ప్రమోషన్స్ ప్రారంభించనుంది.