టాలీవుడ్ నటుడు శర్వానంద్ కొత్త ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. షర్ట్‌లెస్ గా, సిక్స్ ప్యాక్‌తో ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ప్రస్తుతం అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో 'బైకర్' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసమే ఆయన ఈ మేకోవర్ అయ్యారని ఇందులో రేసర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.