ప్రియుడి కోసం పారిపోయి.. వేరేవాడిని పెళ్లి చేసుకుంది

53501చూసినవారు
ప్రియుడి కోసం పారిపోయి.. వేరేవాడిని పెళ్లి చేసుకుంది
ప్రియుడి కోసం పారిపోయిన యువతి ఏకంగా మరో యువకుడిని పెళ్లి చేసుకున్న ఘటన ఇండోర్ లో జరిగింది. శ్రద్ధా తివారీ అనే యువతి.. ప్రియుడు సార్థక్ ను పెళ్లి చేసుకోవాలని ఇంటి నుంచి పారిపోయింది. సార్థక్ వద్దకు వెళ్లి పెళ్లి చేసుకుందామని అడగగా.. 'నేను నిన్ను పెళ్లి చేసుకోను' అని తేల్చి చెప్పాడు. మనసు విరిగిన ఆ అమ్మాయికి ఏం చెయ్యాలో తెలియక రైలు ఎక్కేసింది. తరువాత కరన్ దీప్ పరిచయం అయ్యాడు. అది ప్రేమగా మారి పెళ్లి చేసుకొని ఇంటికి తిరిగొచ్చింది.

సంబంధిత పోస్ట్