రాజస్థాన్‌లో ప్రభుత్వ అధికారి భార్య, ఎటువంటి పని చేయకుండానే రెండు ప్రైవేట్ సంస్థల నుండి రూ.37 లక్షల జీతం పొందిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజ్‌కంప్ ఇన్ఫో సర్వీసెస్‌లో ఐటీ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రద్యుమ్నా దీక్షిత్ భార్య పూనమ్, ఓరియన్ ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ సంస్థలలో ఉద్యోగిగా ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి, 2019 సెప్టెంబర్ నుండి 2020 మధ్యకాలంలో ఐదు బ్యాంకు ఖాతాల ద్వారా రూ.37 లక్షలు జీతంగా అందుకున్నట్లు అవినీతి నిరోధక బ్యూరో దర్యాప్తులో తేలింది.