గణేశ్ ఉత్సవాల్లో షీ టీమ్స్ నిఘా.. 2,935 మంది ఆకతాయిల గుర్తింపు

0చూసినవారు
గణేశ్ ఉత్సవాల్లో షీ టీమ్స్ నిఘా.. 2,935 మంది ఆకతాయిల గుర్తింపు
గణేశ్ ఉత్సవాల సందర్భంగా మహిళలు, యువతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ మండపాల వద్ద షీ టీమ్స్‌ను మోహరించి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిపై దృష్టి సారించారు. సెప్టెంబర్ 14 నుంచి 26 వరకు నిర్వహించిన తనిఖీల్లో 2,935 మంది ఆకతాయిలను గుర్తించారు. వీరిలో 858 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించగా, 69 మందికి శిక్ష విధించారు. 24 మందికి రూ.1,050 జరిమానా, 40 మందికి సామాజిక సేవతో పాటు రూ.1,050 జరిమానా, ఐదుగురికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించారు.

సంబంధిత పోస్ట్