విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ శిల్పాశెట్టి దంపతులు బాంబే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. రూ.60 కోట్ల మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరికీ ముంబయి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను కొట్టివేసి, వృత్తిపరంగా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో, రూ.60 కోట్లు డిపాజిట్ చేయాలన్న షరతు నేపథ్యంలో వారు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.