
భారతదేశం భయంతోనో, ఒత్తిడితోనో ఏ అడుగు వేయదు: రాజ్‌నాథ్‌సింగ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్థాన్ అణు పరీక్షలు చేయబోతోందన్న వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, భారతదేశం భయం లేదా ఒత్తిడితో ఏ అడుగు వేయదని, ఇతర దేశాలు ఏం చేయాలనుకుంటున్నాయో చేయనివ్వాలని అన్నారు. భారతదేశం సముచితమని భావిస్తే, సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటుందని, భవిష్యత్ మాత్రమే దీనిపై చెబుతుందని ఆయన పేర్కొన్నారు.




