ఒకే శిలలో శివకేశవులు.. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?

2చూసినవారు
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఉన్న హరిహర్ ప్రాంతంలో హరిహరీశ్వర క్షేత్రం వెలసి ఉంది. ఇక్కడ శివకేశవులు ఒకే శిలలో అర్ధనారీశ్వర రూపంలో దర్శనమివ్వడం విశేషం. గుహాసురుడిని సంహరించడానికి శివుడు, విష్ణువు ఏకమయ్యారని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయాన్ని హొయసల రాజు రెండవ నరసింహ మంత్రి పొల్వాల నిర్మించారు. ప్రపంచంలో ఇలాంటి క్షేత్రం ఇదొక్కటే. త్రిశూలం, శంఖం ఈ ఏకశిలలో కనిపిస్తాయి. దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి వచ్చి ముక్తిని పొందుతారని విశ్వాసం. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్