
యువతి దారుణ హత్య
TG: ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి దారుణ హత్యకు గురైది. ఈ ఘటన సిద్దిపేట(D) వర్గల్(M) పరిధిలోని నాచారం గ్రామంలో కలకలం రేపింది. తూఫ్రాన్(M) ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన జోడు నర్సింహులు కుమార్తె కల్పన(26) భర్తతో గొడవలు కారణంగా తల్లిగారి ఇంటివద్ద ఉంటోంది. ఈ క్రమంలో DEC 30న సాయంత్రం హెల్త్ చెకప్ కోసం HYD వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. అయితే డిసెంబర్ 31 అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడకు వైర్ గట్టిగా బిగించి హత్య చేసి.. మృతదేహాన్ని నాచారం గ్రామ శివారులో పడేసినట్లు గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.




