మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' చిత్రానికి తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలింది. సినిమా విడుదల తొలి వారం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు అత్యవసర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. అయితే జూన్ 4న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ల పెంపు ప్రయోజనం ఉండదని భావించిన నిర్మాతలు పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో తెలంగాణలో పాత టికెట్ ధరలకే సినిమా ప్రదర్శించనున్నారు.