తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న నటుడు విజయ్‌కు ఊహించని షాక్ తగిలింది. టీవీకేకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ ప్రకటించింది. డీఎంకే నాయకత్వం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని IUML అధినేత ఖాదర్ మొహిదీన్ స్పష్టం చేశారు.