నగరాల్లో ఫుడ్ డెలివరీ యాప్‌లపై ఆధారపడేవారికి జొమాటో నుంచి ఊహించని షాక్ తగిలింది. సెప్టెంబర్ 22న దివ్య శర్మ అనే యువతి జొమాటోలో ఐస్ క్రీం చీజ్ కేక్ ఆర్డర్ చేసింది. భారీ వర్షం కారణంగా డెలివరీ సమయం పెరగడంతో 10 నిమిషాల్లోనే ఆర్డర్‌ను రద్దు చేసుకుంది. అయితే, రీఫండ్ కోసం ప్రయత్నించగా, డెలివరీ పార్ట్నర్ అసైన్‌మెంట్ కోసం రూ.670 ఛార్జీ విధించినట్లు జొమాటో తెలిపింది. దీనిపై యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, జొమాటో స్పందించి డబ్బును రీఫండ్ చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోతే రీఫండ్ లభించేది కాదని ఆమె పేర్కొంది.