కూలర్‌లో నీరు నింపుతుండగా షాక్... ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి

10చూసినవారు
కూలర్‌లో నీరు నింపుతుండగా షాక్... ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని కోరికంటి తండాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో కూలర్‌లో నీళ్లు నింపుతున్న సమయంలో విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకులు రాథోడ్ అర్జున్, రాథోడ్ శ్రీనివాస్ మృతి చెందారు. ఇనుప రాడుతో నీళ్లు పోస్తుండగా విద్యుత్ సరఫరాలో సర్క్యూట్ ఏర్పడి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్