
వివాహేతర సంబంధం కోసం భర్త హత్య.. కూతురు సాక్ష్యంతో తల్లికి యావజ్జీవం
TG: జోగులాంబ గద్వాల జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చిన కేసులో భార్య చాకలి కృష్ణవేణి, ఆమె ప్రియుడు సంకటి మహేష్‌తో పాటు మరో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2019లో జరిగిన ఈ హత్య కేసులో, 12 ఏళ్ల కూతురు ఇచ్చిన కీలక సాక్ష్యం కేసులో ప్రధాన పాత్ర పోషించింది. భర్త షాలును నమ్మించి కర్నూలుకు తీసుకెళ్లి, తిరుగు ప్రయాణంలో హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ఐదవ నిందితుడు తంబలి కార్తీక్‌పై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషిగా విడుదల చేశారు.




