షాకింగ్.. పెండ్లి కాని వారికి క్యాన్సర్ ముప్పు !

89చూసినవారు
షాకింగ్.. పెండ్లి కాని వారికి క్యాన్సర్ ముప్పు !
పెళ్లికాని వారికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉందని 'క్యాన్సర్ రీసెర్చ్ కమ్యూనికేషన్స్' జర్నల్ అధ్యయనం వెల్లడించింది. 2015-2022 మధ్య 10 కోట్ల మందికి పైగా డేటాను విశ్లేషించి, 40 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులను పరిశీలించారు. 30 ఏళ్లు పైబడిన వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఈ అధ్యయనంలో, పెళ్లికాని పురుషుల్లో అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదం, మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రమాదం సుమారు 70% వరకు ఎక్కువగా ఉందని తేలింది. మహిళల్లో ఈ ప్రమాదం మరింత అధికంగా ఉంది.

సంబంధిత పోస్ట్