అమెరికాలోని మిషిగాన్‌లో కాల్పుల కలకలం రేపింది. ప్రార్థనల సమయంలో కాల్పులు జరిపిన దుండగుడు ఇద్దరిని హతమార్చగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆగంతకుడు ముందుగా కారుతో చర్చిలోకి దూసుకెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం చర్చికి నిప్పుపెట్టాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎదురుకాల్పుల్లో నిందితుడిని మట్టుబెట్టారు.