బాలీవుడ్ నటి దిశాపటానీ ఇంటి ముందు గత నెల 12వ తేదీన కాల్పులు జరిగిన సంఘటన కలకలం రేపింది. దిశాపటానీ సోదరి కుష్బూ పటానీ ఒక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ కాల్పులు తామే జరిపినట్లు గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. దిశాపటానీ తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సంఘటనతో దిశాపటానీ వార్తల్లో నిలిచింది.