ట్రంప్‌పై కాల్పులు.. హింసకు తావులేదన్న ప్రధాని మోదీ

12457చూసినవారు
ట్రంప్‌పై కాల్పులు.. హింసకు తావులేదన్న ప్రధాని మోదీ
అమెరికాలోని వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో స్పందించారు. కాల్పుల ఘటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ, వైస్ ప్రెసిడెంట్‌కు ఎలాంటి హాని జరగలేదని తెలిసి ఊరట కలిగిందని మోదీ పేర్కొన్నారు. వారు సురక్షితంగా ఉన్నారని తెలుసుకోవడం సంతోషకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేసిన మోదీ, ఈ ఘటనను ప్రతి ఒక్కరూ నిస్సందేహంగా ఖండించాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :