అమెరికాలో కాల్పుల కలకలం రేపింది. పెన్సిల్వేనియాలోని నార్త్ కోడోరస్ టౌన్‌షిప్‌లో బుధవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా మృతి చెందాడు. గృహహింస కేసులో విచారణకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిలడెల్ఫియా నగరానికి సుమారు 185 కి.మీ. దూరంలో ఈ కాల్పులు జరిగాయి. ఘటనపై గవర్నర్ జోష్ షాపీరో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.