అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య!

13చూసినవారు
అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య!
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు భారత సంతతి వ్యక్తులు మృతి చెందారు. మృతులను మీము డోగ్రా, గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీశ్ చందర్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడైన విజయ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్