అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. క్లే కౌంటీలో జరిగిన ఘటనలో ఆరుగురు మృత చెందారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మూడు వేర్వేరు ప్రదేశాల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.