పంజాబ్‌లోని కపుర్థల ప్రసిద్ధ మాతా శ్రీ భద్రకాళి ఆలయం వద్ద ఓ మహిళా భిక్షుకురాలిపై దుకాణదారుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమెను చెప్పుతో కొడుతూ, కాళ్లతో తన్నుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె పిల్లలు తన బైక్‌ను తాకారనే కోపంతో వికాస్ శర్మ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు సుమోటోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.