హైదరాబాద్ సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో షార్ట్‌ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న 19 ఏళ్ల మేఘావత్ నారాయణ అలియాస్ మహేష్, బెయిల్‌పై విడుదలైన కొద్దిరోజులకే ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కుటుంబ సభ్యులు మహేష్‌పై కావాలనే తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపించారని, అమాయకుడైన తమ కుమారుడు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు.