TG: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. మంత్రుల నియోజకవర్గంలో మాత్రమే బిల్లులు వస్తున్నాయని, ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదని అన్నారు. నిధుల కోసం మంత్రులు, సీఎం చుట్టూ తిరగాలా అని ఆయన ప్రశ్నించారు. సీఎం తన సొంతనియోజకవర్గం కొడంగల్ ను అభివృద్ధి చేసుకున్నట్లు.. మునుగోడులో చేసుకోవాలని ఉండదా అని నిలదీశారు. ప్రజలకు న్యాయం చేయకపోతే నేను ఈ పదవిలో ఉండటానికి అనర్హుడిని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.